KGF చాప్టర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..?

shami
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా సూపర్ హిట్ అందుకున్న సినిమా కె.జి.ఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సినిమా సీక్వల్ గా కె.జి.ఎఫ్ చాప్ట 2 తెరకెక్కుతుంది. కె.జి.ఎఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉండగా సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద ఆడియెన్స్ అంచనాలు ఎలా ఉన్నాయో వాటిని రెట్టింపు చేసేలా సినిమా టీజర్ వదిలాడు.

పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ ఫుల్ అంటూ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా కొటేషన్ ను సూపర్ గా చెప్పాడు ప్రశాంత్ నీల్. పర్ఫెక్ట్ డైరక్షన్.. పర్ఫెక్ట్ మేకింగ్.. భారీ బడ్జెట్.. వీటిని సమతూకం చేసుకుంటూ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అదరగొట్టేందుకు సిద్ధమైంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు వావ్ అనేస్తున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా జూలై 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చాప్టర్ 2 అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ ఇయర్ లో వచ్చే క్రేజీ మూవీస్ లో ఇది ఒకటి. తప్పకుండా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 బాహుబలి వసూళ్లకు ధీటుగా సినిమా కలక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై టీజర్ తోనే సూపర్ హిట్ టాక్.. పాజిటివ్ బజ్ వచ్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: