రవితేజ యాటిట్యూడ్ కి మండిపడుతున్న ప్రేక్షకులు...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....“సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి..సినిమాని ఆదరించండి. ఆశీర్వాదించండి. పైరసీని ఎంకరేజ్ చెయ్యకండి. ప్రేక్షక దేవుళ్ళ రివ్యూ  కోసం వెయిట్ చేస్తున్నాం, దయచేసి మా సినిమాను చూడండి, మాస్కులు పెట్టుకొని థియేటర్లకు రండి. జాగ్రత్తలు పాటించండి” అంటూ హీరోలు సినిమా విడుదల సమయంలో  చేసే హడావుడి మాములుగా ఉండదు. రాజకీయ నాయకులు  ఎలక్షన్స్ ముందు ఓటర్ ఇంటికి వెళ్లి చేసే హడావుడి కంటే.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ & సోషల్ మీడియాలో మన హీరోలు, దర్శకనిర్మాతలు, హీరోయిన్లు చేసే హడావుడి అంతా ఇంత కాదు.

మరి అంత పద్దతిగా థియేటర్లకు ఆడియన్స్ ను పిలిచినప్పుడు.. థియేటర్ కి వచ్చిన జనాలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియక థియేటర్ల దగ్గర ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్న వారి గురించి కనీసం ఆలోచించాలి కదా. ముఖ్యంగా హీరో రవితేజ యాటిట్యూడ్ కు ఇండస్ట్రీ కూడా షాక్ అవుతోంది. ఇవాళ ఉదయం సినిమా రిలీజ్ అవుతుంది అని సోషల్ మీడియాలో పోస్ట్  చేసిన రవితేజ.. కనీసం విడుదల పోస్ట్ పోన్ అవుతుంది అని కానీ, పోనీ ఎప్పుడు విడుదలవుతుంది అని కానీ కనీసం ఒక పోస్ట్ లేదు.

అందువల్ల సినిమా అభిమానులు మండిపడుతున్నారు. కనీసం ఒక అప్ డేట్ అయిన ఇవ్వాలిగా అని సోషల్ మీడియా లో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: