కేజిఎఫ్ లో యష్ కి సంజయ్ దత్ కి మధ్య ఫైట్ సీన్స్ ఓ రేంజిలో ఉంటాయట....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కేజీఎఫ్ లో యష్ కి పోటీగా వున్న మరో పాత్ర ఏంటంటే అది సంజయ్ దత్ పోషించిన అధీర పాత్ర.చాలా  క్రూరంగా ఈ పాత్ర ఉండబోతోందట. అయితే, ఈ పాత్రకోసం సంజయ్ దత్ ని అనుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ పాత్ర  ఆయన పోషిస్తాడో లేదా అనే అనుమానంతో  వచ్చాడని, నేను వెంటనే ఓకే చేసేసరికి ప్రశాంతంగా ప్రశాంత్ నీల్ ఉన్నాడని చెప్తున్నాడు బాలీవుడ్ క్రేజీస్టార్ సంజయ్ దత్. కేజీఎఫ్ టీజర్ విడుదలయిన సందర్భంగా నెటిజన్స్ తో ముచ్చటించాడు సంజూ భాయ్.అధీరా పాత్రకి ఆ గెటప్ కి గంటన్నరసేపు మేకప్ అయ్యేదని, అది చేస్తున్నపుడు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించేదని చెప్పుకొచ్చాడు.

సెట్స్ లో ప్రశాంత్ నీల్ చాలా కూల్ గా ఉంటారు. ఫస్ట్ టైమ్ ఇలాంటి డైరెక్టర్ తో పనిచేసినందుకు రియల్లీ హ్యాపీగా ఉంది. అంతేకాదు, మేము మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ప్రశాంత్ దగ్గర ఎంతో నేర్చుకున్నాను కూడా. నా కెరియర్ లో పోషించిన అన్ని పాత్రల కంటే కూడా అధీరా చాలా ప్రత్యేకమైనది. నేను ఎంజాయ్ చేస్తూ పోషించిన పాత్ర ఇది.భయం, దయాదాక్షిణ్యం లేని అతి క్రూరుడు అధీరా. ఇక నాకు, యష్ కి వచ్చే సన్నివేశాలు అద్దిరిపోతాయని, ఇద్దరి మద్యన వచ్చే యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉంటాయని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు.

చాప్టర్ వన్ కంటే కూడా చాప్టర్ టు లో యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రేక్షుకులు థియేటర్ లో తప్పుకుండా ఒక కొత్త అనుభూతిని పొందుతారు అంటూ సంజయ్ దత్ చెప్పారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: