డబ్బే డబ్బు : జీవనకాల గరిష్టాలకు సూచీలు దేనికి సంకేతం !

Seetha Sailaja
భారత్ జీడిపి క్షీణత 7.7 శాతానికి పరిమితం అవుతుందని అంచనాలు విదేశీ పెట్టుబడులు 2 వేల కోట్ల వరకు వస్తాయి అనే ఆశలు బైడెన్ గెలుపును ట్రంప్ అంగీకరించడం వంటి కారణాలతో మార్కెట్ లాభాల జైత్రయాత్ర కొనసాగుతూ జీవన కాల గరిష్టాలకు సెన్సెక్స్ నిఫ్టీలు దూసుకు పోవడంతో మదుపర్ల సంపద 196 లక్షల కోట్లకు చేరుకుంది. దీనితో రేపటి సోమవారం స్టాక్ మార్కెట్ పరుగుల గురించి ఎవరి అంచనాలు వారు వేసుకుంటూ రేపటి సోమవారం స్టాక్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయి అన్న అంచనాలతో మదుపర్లు ఉన్నారు.

అమెరికన్ షేర్ మార్కెట్ దూకుడుకు సరిసమానంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడ పరుగులు తీయడంతో మదుపర్లు మంచి జోష్ లోకి వెళ్ళిపోయారు. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించిన 5వ ఐటీ కంపెనీగా టెక్ మహేంద్ర నిలవడంతో ఈ కంపెనీ షేర్ కు విపరీతమైన విలువ ఏర్పడింది.

గడిచిన 9 సంవత్సరాలలో అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను కనపరిచి 42 వేల కోట్ల పై చిలుకు ఆదాయాన్ని టీసీఎస్ కంపెనీ పొందడంతో ఈ కంపెనీ షేర్ కూడ విపరీతమైన పరుగులు తీసింది. వ్యక్తిగత వాణిజ్య వాహనాలకు ఈ సంవత్సరం మంచి డిమాండ్ ఏర్పడుతుంది అన్న అంచనాలు రావడంతో మహేంద్ర మహేంద్ర షేర్ కూడ బాగా రాణించింది.

దీనికితోడు మనదేశ విదేశీ మారకపు నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకొని 33,500 కోట్ల స్థాయిలో మన విదేశీమారకపు నిల్వలు ఉన్నాయి అన్న వార్తలు రావడంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. ఇది ఇలా ఉండగా 2 లక్షల లోపు బంగారం కొనుగోళ్లకు ఎటువంటి కేవైసీ అక్కరలేదు అన్న నిబంధన రావడంతో దేశంలో అనేకమంది బడాబాబులు దగ్గర ఉన్న నల్లదనం వైట్ మనీ గా మారే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈ సంవత్సరం వెండి ధర తారా స్థాయికి చేరుకుంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో అటు షేర్లు ఇటు బంగారం ఈ సంవత్సరంలో మెరుపులు మెరవడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: