ఈమధ్య కాలంలో సినిమా బ్లాక్ బస్టర్ కావాలి అంటే హీరోలు ఎదో ఒక పాటలో లుంగీ డాన్స్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఈ సెంటిమెంట్ నే ఫాలో అయి తమ సినిమాలను బ్లాక్ బస్టర్స్ గా మార్చుకున్నారు. గతంలో ‘పోకిరి’ చిత్రంలో మహేష్ బాబు లుంగీ డాన్స్ తో అదరకొట్టిన సంగతి తెలిసిన విషయమే.
ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మహేష్ తిరిగి ఎంచుకున్నాడు. మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆగడు' సినిమా కోసం మహేష్ మళ్ళీ ఈ లుంగీ డాన్స్ ను ఎంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రుతిహాసన్ తో మహేష్ చేస్తున్న ఐటమ్ సాంగ్ లో ఈ సినిమాలోని విలన్ సోనూ సూద్ తో కలిసి ఈ లుంగీ డాన్స్ చేసాడు అని టాక్.
గతవారం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన ‘ఆగడు’ ఐటమ్ సాంగ్ లో ఒక ప్రక్క మహేష్ లుంగీ డాన్స్, మరో ప్రక్క శ్రుతి హాసన్ హాట్ స్టెప్స్, సోనూ సూద్ ఫన్నీ మూమెంట్స్ ఇవి అన్నీ కలిపి ‘ఆగడు’ ఐటమ్’ సాంగ్ ను ఒక రేంజ్ లో తీసుకు వెళ్ళి పోయిందని ఆ సినిమా షూటింగ్ చూసిన వాళ్ళు చెపుతున్నారు.
ఇప్పటికే మహేష్ ‘పులులు, సింహాలు’ అంటూ తన పంచ్ డైలాగ్స్ తో ‘ఆగడు’ టీజర్ లో సృష్టించిన సంచలనానికి మరొక ముందడుగు వేసి మహేష్ ఈ లుంగీ డాన్స్ తో ‘ఆగడు’ పై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: