చైతన్య వాస్తవ దృష్టికి షాక్ అయిన సమంత !
ఈ క్రేజ్ గ్రహించిన దిల్ రాజ్ తిరిగి వారిద్దరి కాంబినేషన్ లో మూవీ తీయాలి అని చేసిన ప్రయత్నాలకు చైతన్య మొదట్లోనే అడ్డుకట్ట వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ కథ రీత్యా ఆ మూవీలో నటించే హీరోయిన్ ది చాల కీలక పాత్ర అని తెలుస్తోంది.
దీనితో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న విక్రమ్ కుమార్ ఆలోచనలకు దిల్ రాజ్ ప్రభావితమై ఈమధ్య చైతన్యను కలిసి ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సమంతను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న సూచన ఇచ్చినట్లు టాక్. అంతేకాదు సమంత నాచైతన్య లు మళ్ళీ రిపీట్ అయితే ‘మజిలీ’ మూవీకి వచ్చినంత క్రేజ్ వస్తుందని చెప్పి చైతన్యను ఒప్పించడానికి దిల్ రాజ్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే దిల్ రాజ్ సూచనకు ఒక్క క్షణం కూడ చైతన్య ఆలోచించకుండా మళ్ళీ తమ కాంబినేషన్ రిపీట్ చేసే ప్రయోగాలు వద్దు అని అంటూ వేరే హీరోయిన్ ను చూడమని స్పష్టంగా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో చైతన్య ప్రాక్టికల్ అవుట్ లుక్ కు దిల్ రాజ్ విక్రమ్ కుమార్ లు ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు సమంతకు చాల ఆలస్యంగా తెలిసి ఈవిషయమై చైతూను ప్రశ్నించినప్పుడు చైతు ఒక స్వీట్ స్మైల్ చేసినట్లు టాక్..