నాగ చైతన్య సరసన సీరియల్ భామ..వర్కౌట్ అయ్యేనా..?

P.Nishanth Kumar
అక్కినేని హీరో నాగ చైతన్య హిట్లు , ఫ్లాప్ లతో సంభందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. అయన నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. మజిలీ సినిమా తో పర్వాలేదనిపించింది వెంకీ మామ చిత్రం మాత్రం ప్రేక్షకులను నిరాశనే మిగిల్చింది. అంతకుముందు కూడా చైతు భారీ ఫ్లాప్లనే మూటగట్టుకున్నాడు.. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు..

సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా టీజర్ ప్రేక్షకులకు నచ్చింది.. ఇందులో అందరి నటనకు ప్రేక్షకులకు ముగ్దులయిపోయారని తెలుస్తుంది. టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచేలా చేశాడు చైతు.. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒక మూవీ ఓకే చేసాడట.

అది అలా హోల్డ్ లో పెట్టి మనం లాంటి ఫ్యామిలీ హిట్ అందించిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ సినిమా ఓకే చేసాడు. ఇటీవల విక్రమ్ కె.కుమార్ తో చేయబోయే సినిమాకు 'థాంక్ యూ' అనే సింపుల్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కూడా మనం లాగే వెరైటీ కథ తో రాబోతుందట. ఈ చిత్రాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నాడట.. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అవికా గోర్ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట.. సీరియల్ నటిగా పేరున్న అవికా కి తెలుగులో మంచి సినిమాలే చేసింది. దాదాపు ఫేడ్ అవుట్ దశలో ఆమెకు ఈ ఆఫర్ రావడం చూస్తుంటే ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: