ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !

Seetha Sailaja
‘వి’ ఫెయిల్యూర్ తరువాత నాని తన సినిమాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న తన ఫ్లాప్ ల ట్రెండ్ కు చెక్ పెట్టే విధంగా నాని తన భవిష్యత్ సినిమాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘టాక్సీవాల’ మూవీ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో నాని 75 సంవత్సరాల వృద్ధుడుగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.


కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో కూడుకున్న ఈ మూవీ కోసం హైదరాబాద్ లో కలకత్తా వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ వేసారు. ఈ టైటిల్ డిఫరెంట్ గా ఉండటంతో ఈమూవీని డబ్ చేసి వివిధ భాషలలో విడుదల చేయాలని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రభాస్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ హీరోలు అంతా పాన్ ఇండియా బాట పడుతున్న పరిస్థితులలో ఈ రేస్ లో వెనక్కు తగ్గ కూడదని నాని ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేయాలని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఈ మూవీ నిర్మాతలు ‘శ్యామ్ సింగరాయ్’ ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


దీనితో నాని కూడ నేషనల్ స్టార్ గా మారిపోదామని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి మడోనా సెబాస్టియన్ కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఉత్తరాది ప్రేక్షకులు దక్షిణాది హీరోలను పెద్దగా ఆదరించరు. అయితే ప్రభాస్ యష్ లు నేషనల్ స్టార్స్ గా ఎదిగిన పరిస్థితులలో ఇప్పుడు తెలుగు హీరోలు అంతా నేషనల్ స్టార్స్ గా మారిపోవాలని పాన్ ఇండియా మూవీల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ లిస్టులో మహేష్ ఇప్పటి వరకు లేకపోవడం ఆశ్చర్యకరం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: