దానికి వయసుతో పనేముంది...ప్రియాంక చోప్రా బోల్డ్ టాక్...!
ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ జంట ఎక్కడికెళ్లినా అందరినీ ఆకర్షిస్తుంటారు. వీరిని అడగడానికి ఎన్నో ప్రశ్నలను నోట్ చేసుకొని మరీ వెయిట్ చేస్తుంటారు. అయితే ఈసారి మరో బెడ్ రూమ్ సీక్రెట్ ను రివీల్ చేసింది ప్రియాంక. ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక టక్కున చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్జొనాస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంకకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి ఆమె ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏంటి అంటే...??? మీ మధ్య 10 సంవత్సరాల అంతరం ఉంది కదా? అని హోస్ట్ ప్రశ్నించగా.... అందుకు సరదాగా సమాధానం చెప్తూ ప్రియాంక పెదవి జారి రహస్యాన్ని బయట పెట్టేసింది.
వయసులో చిన్నోడైనా ఆ పనిలో నిక్ గొప్పోడు. అయినా కాపురానికి వయసుతో పనేముంది?`` అంటూ టక్కున బోల్డ్ సమాధానం ఇవ్వడంతో హోస్ట్ తో పాటు వీక్షకులు కూడా అవాక్కయ్యారు. అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నిక్ పై ఇంత హాట్ కామెంట్ చేయడంతో కొందరు ఇదేంటబ్బా అని ఆశ్చర్య పోతుంటే..... మరికొందరు మనసులో ఉన్న మాట ఏదైనా సరే నిర్మొహమాటంగా బయటకు చెప్పే ప్రియాంక గ్రేట్ అంటున్నారు. ఇంకొందరు ఎంతైనా అమెరికా కోడలు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ ప్రియాంక ఇలా తన భర్త నిక్ కు బెడ్ రూమ్ లో నిద్రపోతున్నప్పుడు తన ముఖం చూస్తూ ఉండాలి అంటే ఇష్టమని షాక్ ఇచ్చారు.