'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమా ఒక రియల్ స్టోరీ అన్న విషయం మీకు తెలుసా.. ఆ సినిమా గురించి నమ్మలేని నిజాలు..??

Anilkumar
విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల్లో 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమా కూడా ఒకటి..ఈ సినిమాకి తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమా తెర వెనుక చాలా సంఘటనలు జరిగాయి.. వాటన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం.."  సెల్వ రాఘవన్ ఫ్రెండ్ విషయంలో జరిగిన యదార్ధ గాధను ఇతివృత్తంగా మలిచి కథ రాసాడు. ఇక అదే సమయానికి ప్రొడ్యూసర్స్ నాగవెంకట అశోక్ కుమార్, ఎన్వీ ప్రసాద్ లు సెల్వ రాఘవన్ ని కల్సి ఓ సినిమా చేయమని అడిగారు. అప్పటికే వాళ్ళు వెంకీతో వసంతం సూపర్ హిట్ మూవీ నిర్మించారు..అయితే దాదాపు రెండేళ్ల తర్వాత డైరెక్టర్ కి పిలుపు రావడంతో వెళ్లి కథ చెప్పడం, నచ్చేయడం, సినిమాకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని టైటిల్ పెట్టడానికి కూడా వెంకీ ఒకే చెప్పడం జరిగింది. యువన్ శంకర్ మ్యూజిక్. కీలక పాత్రకు కె విశ్వనాధ్ ఒకే.

2006ఫిబ్రవరి 3న ఈ సినిమాకు రామానాయుడు స్టూడియోలో చిరంజీవి క్లాప్ కొట్టారు. అయితే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి పెళ్లి ఫిక్స్ కావడంతో హీరోయిన్ గా చేయడం లేదని చెప్పేసింది. దీంతో చాలామందిని అనుకున్నా కుదరలేదు. జ్యోతికను తీసుకున్నారు. షూటింగ్ రెగ్యులర్ గా స్టార్ట్ చేయాలనీ అనుకునే సమయానికి జ్యోతికకు సూర్యతో పెళ్లి ఫిక్స్. దాంతో త్రిష హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. మరోపక్క తులసి మూవీ కూడా వెంకీ కమిట్ అయ్యాడు. కలర్ స్వాతిని కూడా వేరే పాత్రకు తీసుకున్నారు.అయితే తులసి మూవీ షూటింగ్ లో వెంకీ భుజానికి గాయం అయింది. దాంతో మరోనెల వాయిదా. కోలుకున్నాక మార్చి నెలాఖరుకి షూటింగ్ కంప్లిట్ చేసారు.

మార్చి 28న ఆడియో రిలీజ్. సాంగ్స్ సూపర్భ్ . 2007ఏప్రియల్ 27న 267థియేటర్స్ లో మాత్రమే మూవీ రిలీజ్. సరదా, వినోదం, ఎమోషన్ సీన్స్ తో పక్కా స్క్రీన్ ప్లే తో సినిమా సాగిపోవడం జనానికి నచ్చేసింది..అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వెంకీకి దక్కింది. బెస్ట్ ఫిలిం గా కూడా నంది గెలుచుకుంది. త్రిషకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. 21సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ విజయవాడ సిటీలో 67లక్షలు కలెక్ట్ చేసి టాప్ గ్రాసర్ గా నిల్చింది. టోటల్ 20కోట్లు కలెక్ట్ చేసి, 2007టాప్ సిక్స్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: