ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
తెలుగు ఇండస్ట్రీ అంతా ఆర్‌ఆర్‌ఆర్‌ వైపే చూస్తోంది. రాజమౌళి ఎప్పుడెప్పుడు నోరు మెదుపుతాడా? అని వెయింటింగ్‌. రాజమౌళి తీసుకునే డెసిషన్‌పై.. కొన్ని సినిమాలు ఆధారపడ్డాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ తెలిస్తేగానీ.. తెలుగు సినిమా ఊపిరిపీల్చుకోదు.

కరోనా రాకముందు.. ఆర్‌ఆర్‌ఆర్‌ను 2021 జనవరి 8న రిలీజ్‌ అంటూ ఎనౌన్స్‌ చేస్తే.. ఇదే పండక్కి రావాలనుకున్న.. మహేశ్‌.. పవన్ వెనక్కి తగ్గారు. ఇంతలో కరోనా వచ్చి.. అందరి రిలీజ్‌ డేట్స్‌ తలకిందులు చేసేసింది. దీంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే రెండుసార్లు అనుకున్న సమయానికి రాకపోవడంతో.. మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసి పోస్ట్‌పోన్‌ అయితే.. పరువు పోతుందన్న ఆలోచనలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఉంది.

కరోనా సోకిన రామ్‌చరణ్‌ ప్రస్తుతం హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్నాడు. రిపోర్ట్‌ నెగిటివ్ వచ్చిన వెంటనే... ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. ఫిబ్రవరి నాటికి షూటింగ్‌ పూర్తి చేసేనా.. భారీగా ఉన్న విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తికావాలి. షూటింగ్‌ జక్కన్న చేతులో ఉన్నా.. విజువల్‌ ఎఫెక్ట్స్  ఆయన చేతుల్లో ఉండదు. దీంతో..  విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కొలిక్కి వచ్చిన తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తారట. ఎప్పుడు ప్రకటిస్తారా అని తెలుగు ఇండస్ట్రీ ముఖ్యంగా బన్నీ ఎదురుచూస్తున్నాడు.

ఆర్ఆర్‌ఆర్‌ దసరాకు.. లేదంటే.. 2022 సంక్రాంతికి వస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప దసరాను టార్గెట్‌ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దసరాకు వస్తే.. పుష్ప నెక్ట్స్ సంక్రాంతికి వెళ్లిపోతుంది. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్ బట్టే.. తెలుగు సినిమా లెక్కలేసుకుంటుంది.  

మొత్తానికి దసరా విడుదలకు పుష్ప ముస్తాబవుతోంది. ఇక ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడ్డ ఆర్ఆర్ఆర్.. దసరాకు లేదంటే 2022 సంక్రాంతికి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మెగా అభిమానుల్లో ఉత్కంఠ రేగుతోంది. ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే ఇదిలో ఉన్నారు ఫ్యాన్స్.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: