![శివబాలాజీ - మధుమితకు బ్రేకప్ అయ్యిందట.. షోలో నిజం బయట పెట్టారు..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/shivabalaji0f5ba72d-d2ba-44d1-863e-ac8e74680134-415x250.jpg)
శివబాలాజీ - మధుమితకు బ్రేకప్ అయ్యిందట.. షోలో నిజం బయట పెట్టారు..?
ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు అందరూ కూడా ఎవరికీ తెలియని కొత్త విషయాలన్నింటినీ కూడా బయట పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అలీ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి శివబాలాజీ మధుమిత గెస్ట్ లు గా రాగా... వీరిని కూడా పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి అభిమానులందరికీ సర్ప్రైస్ చేశాడు అలీ. ఈ సందర్భంగానే ఇటీవలే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే శివ బాలాజీ లో నీకు నచ్చనిది ఏంటి అంటూ మధుమిత ను అలీ అడగగా.. మేము ఇద్దరం బ్లెండ్ అయ్యామని వాటర్ మిల్క్ లాగానే ఇద్దరం కలిసి పోయామని.. వాటర్ మిల్క్ ను వేరు చేయడం కుదరదు అలాగే తమ ఇద్దరిని వేరు చేయడం కుదరదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పెళ్ళికి ముందు మీకు బ్రేక్ అయ్యిందట కదా అంటూ ఒక ప్రశ్న అడుగుతాడు అలీ... బ్రేకప్ ఉందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని.. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి బ్రేకప్ అయ్యేదని కానీ మళ్ళీ కలిశామని చెప్పుకొచ్చారు ఇద్దరు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.