అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

GVK Writings
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్నారు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ అతి త్వరలో జరుగనున్నట్లు సమాచారం. ఇకపోతే దీనితో పాటు మరోవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య లో కూడా నటించడానికి ఒప్పుకున్నారు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. తిరు ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాని దేవాలయ భూములు, కుంభకోణాల నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నట్లు టాక్.

కాగా ఈ సినిమా షూటింగ్ లో నేడు రామ్ చరణ్ జాయిన్ అయ్యారని, ఆయన ఈ సినిమాలో సిద్ద అనే క్యారెక్టర్ చేస్తున్నారు అంటూ దర్శకుడు శివ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ పెట్టారు. దానిలో చరణ్ లుక్ ని కూడా శివ పోస్ట్ చేసారు. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ తన మెడలో రుద్రాక్ష దండ వేసుకుని ఉండడం గమనించవచ్చు. కాగా ప్రస్తుతం ఆ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. దీనిని బట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ అదిరిపోయే రేంజ్ లో ఉండనుందని పలువురు మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: