విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్.. సోమవారం ఉదయం..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. మళ్లీ రెగ్యులర్ షూటింగ్‌కు చిత్ర టీం సిద్దమవుతోంది. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్, పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఫైటర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఫైటర్ అనేది కేవలం వర్కింట్ టైటిల్ మాత్రమే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను సోమవారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థలు తాజాగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాయి.

భాషలకు అతీతంగా అందరిని అలరించేందుకు ఈ సినిమా సిద్దమవుతోంది. రేపు ఉదయం 10.08 గంటలకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ‘కథలు భాషలతో సంబంధం అయి ఉండే కాలం పోయింది. ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ద్వారా, అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, అవి మీకు ఎలాంటి ఫీలింగ్‌ను కలగజేస్తున్నాయన్నాయి అనేదే ఇప్పుడు ఆధారం. ఇప్పటి వరకు అనేక కథలను మీ ముందుకు తీసుకువచ్చాం. ప్రాంతంతో సంబంధం లేకుండా అందరిని అలరించేందుకు ప్రయత్నించాం. రేపు మా ప్రయాణంలో మరో చాప్టర్‌ను జత చేయబోతున్నాం. భాష అనే బేధాన్ని పక్కన పెట్టి కొత్త ఏజ్ ఆఫ్ సినిమాను తీసుకురాబోతున్నాం’ అంటూ నిర్మాణ సంస్థలు చెప్పుకొచ్చాయి.

కాగా.. విజయ్ దేవరకొండ చివరగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయంగా మిగిలింది. దీంతో ఫైటర్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని రౌడీ బాయ్ విజయ్ కసితో ఉన్నాడు. ఫైటర్ చిత్రం విజయ్‌కు మంచి హిట్‌ను ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: