రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

shami
ప్రభాస్, పూజా హెగ్దే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై భారీ క్రేజ్ తెచ్చాయి. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా నుండి స్పెషల్ న్యూస్ ఒకటి లీకైంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు మించి రాధే శ్యామ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే కనిపిస్తుంది. రాధే శ్యామ్ మర్చిపోలేని ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డైరక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. చివరి ఎపిసోడ్స్ మాత్రమే కాదు సినిమాలో ఇంటర్వల్ కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మే నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్, కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: