అమ్మో..! ఇద్దరూ ఒకేసారి వస్తే ఇంకేమైనా ఉందా..?

NAGARJUNA NAKKA
ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంకా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకోలేదు. సలార్‌ మూవీ ఈ మధ్యనే లాంఛనంగా మొదలైంది. పాన్‌ ఇండియా మూవీ కావడంతో.. త్వరలోనే రిలీజ్‌డేట్‌ ఎనౌన్స్‌ చేస్తారట. ఇంతకీ కథేమిటో తెలుసా... ఈ రెండు పెద్ద ప్రాజెక్టుల రిలీజెస్‌ క్లాష్‌ అయ్యే అవకాశం ఉందట. ఇంతకీ.. సలార్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎప్పుడు వస్తున్నాయంటే..

షూటింగ్‌ పూర్తయి.. గ్రాఫిక్‌ వర్క్‌ ఓ కొలిక్కి వస్తుందన్న నమ్మకం కలిగాకే ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయాలనుకుంటున్నారు. రెండు సార్లు ఎనౌన్స్‌ చేసి భంగపడడంతో.. ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌తో సలార్‌ ఎనౌన్స్‌ చేయడం ఆలస్యం.. షూటింగ్‌ లాంఛనంగా మొదలుపెట్టేసి.. నెలాఖరులో రెగ్యులర్‌ షూటింగ్‌లోకి వెళ్లిపోతున్నారు. వీలైనంత తొందరగా... షూటింగ్‌ ఫినిష్‌ చేయాలన్న పట్టుదలతో సలార్‌ టీం ఉందట.

సలార్‌ను దసరాకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారట. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ కూడా అదే ప్రయత్నాల్లో ఉందట. మార్చినాటికి షూట్‌ పూర్తిచేసి.. గ్రాఫిక్‌ వర్క్‌కు 4 నెలలు ఇచ్చి... లేట్‌ చేయకుండా.. దసరా పండక్కి తీసుకొచ్చేద్దామన్న ప్లాన్‌లో వీళ్లున్నారు.  ఈ ఇద్దరి టార్గెట్‌ చూస్తుంటే.. దసరాకు క్లాష్‌ అయ్యేట్టే ఉన్నారు.

గతంలో ఈ రిలీజ్‌ వ్యవహారం బాహుబలి వర్సెస్‌ శ్రీమంతుడుగా మారింది. బాహుబలి పాన్‌ ఇండియా మూవీ కావడం.. రాజమౌళి మీద మహేశ్‌కు ఉన్న అభిమానంతో.. శ్రీ మంతుడును మూడు వారాలు పోస్ట్‌పోన్‌ చేసుకున్నాడు. బాహుబలి వచ్చిన 4 వారాల తర్వాత శ్రీమంతుడు రిలీజ్ అయింది.

రాజమౌళి మూవీ వస్తోంది కదా అని శ్రీమంతుడు వెనక్కి తగ్గినట్టు.. సలార్‌ తగ్గుతాడని గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. రెండూ పాన్‌ ఇండియా మూవీసే.  బాహుబలి క్రేజ్ రాజమౌళికి ఉంది. ప్రభాస్‌ ఆల్రెడీ పాన్‌ ఇండియా స్టార్‌. ఒకేసారి వస్తే మాత్రం... రికార్డులు ఎవరికీ దక్కువు. కలెక్షన్స్‌ పంచుకోవాల్సి వస్తోంది. రెండు వారాల గ్యాప్‌లో వస్తే.. దసరా సెలవులు క్యాష్‌ చేసుకోవడం కుదరదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: