పూరీ, నాగార్జున శివమణి సీక్వల్..?

shami
పూరీ జగన్నాథ్, కింగ్ నాగార్జున ల కాంబోలో వచ్చిన శివమణి సినిమా సూపర్ హిట్టైంది. పూరీ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన శివమణి సినిమాలో నాగార్జునకు మంచి హిట్ అందించింది. ఈ సినిమాలో రక్షిత హీరోయిన్ గా నటించింది. చక్రి మ్యూజిక్ కూడా సినిమాకు మాస్ అప్పీల్ తెచ్చింది. అయితే శివమణి తర్వాత నాగార్జున, పూరీ కాంబో సినిమా రాలేదు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ కాంబో సినిమా ఉంటుందని అంటున్నారు. శివమణి సీక్వల్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. శివమణి సినిమాకు సీక్వల్ గా పోలీస్ స్టోరీ సిద్ధం చేశాడట పూరీ. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న పూరీ. ఈ సినిమా తర్వాత నాగ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. శివమణి సీక్వల్ గా వస్తే మాత్రం మళ్లీ ఇద్దరు అదరగొట్టడం ఖాయం.

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డ నాగ్ వైల్డ్ డాగ్ తర్వాత సీరియస్ కథలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. వైల్డ్ డాగ్ హిట్ అయితే మళ్లీ నాగ్ ఫాం లోకి వచ్చినట్టే లెక్క. బిగ్ బాస్ సీజన్ 4ని కూడా సక్సెస్ చేసిన నాగ్.. సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: