బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే ఎలా ఉంటుందో తెలుసా?.. హీరోయిన్ కామెంట్స్!

P.Phanindra
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అంద చందాలతోపాటు అభినయంతో కూడా కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అంతటి అందం అభినయం కలిగిన కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకొని అభిమానుల హార్ట్స్ బ్రేక్ చేసిందని ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. కాజల్ అందాలను కనులారా వీక్షించడానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కాజల్.. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటోలు షేర్ చేసి వారిని మురిపిస్తూ ఉంటుంది. కెరీర్ ఫస్ట్ నుండి కూడా కాజల్ గ్లామర్ గాలం వేస్తూ సినీ ప్రియులను తన గుప్పిట్లో బందీ చేస్తూనే వస్తోంది.
ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కాజల్ కు అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో ఆమె పెళ్లయినా కూడా తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోందీ అమ్మడు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో మరో సారి జత కట్టి.. ‘ఆచార్య’ సినిమాలో ఆడి పాడుతోంది. అలాగే స్టార్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు - 2 లో నటిస్తోంది. ఇక కాజల్ పెళ్లి జరిగిన తర్వాత నుండి భర్తతో కలిసి వార్తల్లో నిలుస్తూనే ఉంది. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్లిన కాజల్ దంపతులు.. తాజాగా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికలో షేర్ చేసింది. 'నా బెస్ట్ ఫ్రెండే నా భర్త కావడం చాలా ఆనందంగా ఉంది' అంటూ భర్తతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కాజల్ మెరిసిపోతోందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కాజల్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: