వామ్మో .... 'లైగర్' టైటిల్ వెనుక అంత మర్మం దాగి ఉందా ......??
మరోవైపు విజయ్ దేవరకొండ ఈ మూవీలోని తన క్యారెక్టర్ కోసం పక్కాగా ఫిట్ గా రెడీ అవడం తో పాటు పలు విదేశీ యుద్ధ విద్యల్లో కూడా ఎంతో కఠినంగా శిక్షణ తీసుకున్నట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో విజయ్ ఒక పవర్ఫుల్ ఫైటర్ గా కనిపించనున్నాడని ఈ మూవీ రిలీజ్ తర్వాత అతడికి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ రావడం ఖాయమని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ ని పరిశీలిస్తే దాని వెనుక కొంత మర్మం దాగి ఉందని కొన్ని టాలీవుడ్ వర్గాల టాక్. సింహం లోని రాజసం టైగర్ లోని పవర్ హీరో పాత్రలో ఉంటుందని, ఎటువంటి సమస్యనైనా వీరోచితంగా ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగే హీరో తన జీవితంలో ఎదురైన ఒక సవాల్ ని ఎదుర్కొనేందుకు ఏ విధంగా పోరాడుతూ ముందుకు దూసుకెళ్ళాడు అనేది ఈ సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తమని సమాచారం.
తప్పకుండా ఈ సినిమా రిలీజ్ తర్వాత అన్ని భాషల్లోనూ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తొలిసారిగా తమ హీరో పాన్ ఇండియా మూవీ లో నటిస్తుండటంతో తప్పకుండా ఇది మంచి సక్సెస్ సాధించి ఆయన కెరీర్ కి ఎంతో పెద్ద బ్రేక్ అందిస్తుందని వారు భావిస్తున్నారు. మరి ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న లైగర్ మూవీ రిలీజ్ తర్వాత ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే......!!