రాశి ఖన్నా కి నో చెప్పిన గోపి చంద్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలుగు హీరో గోపి చంద్ మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో విలన్ గా నటించి హీరో తో సమానంగా పవర్ ఫుల్ పాత్రలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మళ్ళీ హీరో గా నటిస్తూ ఒక సందర్భంలో స్టార్ హీరో అయ్యాడు గోపి చంద్. ఒకానొక సమయంలో గోపి చంద్ స్టార్ హీరో అవుతాడని అనుకున్నారంతా. మళ్ళీ తరువాత కొన్ని ప్లాపులు ఎదుర్కున్నాడు గోపి చంద్. మళ్ళీ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. దర్శకుడు మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తరువాత మాస్ మహారాజా రవితేజతో  ఒక మంచి సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరక ఇప్పుడు గోపీచంద్ తో ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇందులో హీరోయిన్ గా రాశిఖన్నాను తీసుకోవాలనేది మారుతి ఆలోచన. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఆమెతో కలిసి వర్క్ చేసిన మారుతి ఆమెని లక్కీ హీరోయిన్ గా భావిస్తున్నాడు. దీంతో మరోసారి ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు.
కానీ హీరో గోపీచంద్ మాత్రం దానికి అసలు ఒప్పుకోవట్లేదట. ఇప్పటికే గోపీచంద్, రాశి కలిసి ‘జిల్’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో నటించారు. ‘ఆక్సిజన్’ సినిమా డిజాస్టర్ అయింది. పైగా ఈ మధ్యకాలంలో రాశి కెరీర్ గ్రాఫ్ ఏమంత బాగాలేదు. ‘శ్రీనివాసకళ్యాణం’, ‘అయోగ్య’, ‘వెంకీమామ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇలా ఆమె లిస్ట్ లో చాలా ప్లాప్ లు వచ్చి చేరాయి. మరి ఈ కారణంగానో లేక మరో వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో కానీ గోపీచంద్ మాత్రం రాశి వద్దని నేరుగా మారుతికి చెప్పేశాడట.
కావాలంటే ఎవరైనా కొత్త హీరోయిన్ ను తీసుకోమంటూ సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మారుతి ఇప్పుడు హీరోని ఎలా ఒప్పించాలా..? అని చూస్తున్నాడు. గోపీచంద్ మరీ పట్టుబడితే మాత్రం కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: