అనిల్ రావిపూడి సీక్వెల్ ఆలోచనలలో రవితేజ

Seetha Sailaja
‘క్రాక్’ మ్యానియా సగటు సినిమా ప్రేక్షకుడుని ఆవహించడంతో ఈమూవీ సూపర్ హిట్ దశగా దూసుకుపోతోంది. వాస్తవానికి ఈమూవీ ఈ రేంజ్ లో  హిట్ అవుతుందని రవితేజా కూడ ఊహించలేదు అని అన్నాడు అంటే అంచనాలు ఎలా తారుమారు అయ్యాయో అర్ధం అవుతుంది.

థియేటర్లకు జనం వస్తారో లేదో తెలియని ఒక సందిగ్ధంలో విడుదలైన ఈమూవీ మ్యానియా మరో రెండు వారాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. రవితేజా నుంచి జనం ప్రేక్షకుడు కోరుకునే మాస్ మసాలా మూవీగా ‘క్రాక్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆనంద పడటమే కాకుండా చరణ్ రోజా ఈమూవీ పై చేసిన ప్రశంసలు ఈమూవీ హైక్ ను మరింత పెంచుతున్నాయి. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అన్నపదం గురించి ఎదురు చూస్తున్న మాస్ మహారాజా లో ఆనందం ఉప్పోoగుతోంది. అయితే ఇప్పుడు ఈహిట్ ట్రాక్ ను ఎలా తన రాబోయే సినిమాలలో కూడ కొనసాగించాలి అన్నవిషయమై ఇప్పుడు రవితేజా ఆలోచనలు కొనసాగుతున్నట్లు టాక్.

ఈపరిస్థితులలో రవితేజ అనిల్ రావిపూడి టచ్ లోకి వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వరుస హిట్లు ఇస్తున్న దర్శకుల జాబితాలో కొనసాగుతున్న అనిల్ రావిపూడితో గతంలో రవితేజా ‘రాజా ది గ్రేట్’ చేసాడు. అప్పటివరకూ ఫ్లాపులతో విసిగెత్తి ఉన్న రవితేజకు ఈసినిమా ఎంతో ఊరటను ఇచ్చింది. ఇప్పుడు ‘క్రాక్’ హిట్ తరువాత రవితేజా మళ్ళీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే అనీల్ రావిపూడి ప్రస్తుతం ఖాళీగా లేడు ‘ఎఫ్ 3’ మూవీ నిర్మాణంలో ఈడైరెక్టర్ చాలబిజీగా ఉన్నాడు. ఈమూవీని చాలవేగంగా పూర్తిచేసి ఈఏడాది సమ్మర్ రేస్ లోకి దింపాలని అనీల్ రావిపూడి ఆలోచన.  అదేవిధంగా రవితేజా కూడ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చేయడానికి సిద్ధమైపోయాడు. అయితే రమేష్ వర్మ స్టైల్ వేరు తన రేంజ్ కి తగిన ఎంటర్టైనర్ కావాలంటే అనిల్ రావిపూడి వల్లనే అవుతుందనే ఉద్దేశంతోనే రవితేజా అనీల్ రావిపూడితో మంతనాలు చేస్తున్నప్పటికీ ఎంతవరకు అనీల్ రావిపూడి ఈరాయబారానికి స్పందిస్తాడు అదేవిధంగా  రవితేజా కోరుకున్నట్లుగా ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కు అంగీకరిస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: