ఆదిపురుష్ గురించి లేటెస్ట్ అప్ డేట్..!

NAGARJUNA NAKKA
ఆదిపురుష్‌ సినిమా బాగుంటుందా? లేదా? అనేది డైరెక్టర్‌ ఓం రౌత్‌ చేతుల్లో లేదు. డైరెక్టర్‌ ఎంత తురుమ్‌ ఖాన్‌ అయినా.. ఆయన చేతుల్లో కొంతే ఉంది. రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని కథ రాసుకున్నాడు. కథ ఎంత బలంగా ఉన్నా.. సక్సెస్‌తో కథను లింక్‌చేయలేం. బాహుబలి హీరోగా ఉన్నా.. ఆయన యాక్టింగ్‌తో పనిలేదు. మరి ఆదిపురుష్‌ హిట్‌ అవ్వాలంటే.. ఏం కావాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

ఆదిపురుష్‌  షూటింగ్‌ మొదలుకాకపోయినా.. 'మోషన్ క్యాప్చర్‌ వర్క్‌ మొదలయింది. ఈ సందర్బంగా దర్శకుడు ఓం రౌత్‌  మోషన్‌ క్యాప్చర్‌ టీంతో దిగిన పొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మోషన్ క్యాప్చర్ స్టార్ట్ అయింది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారంటూ  ప్రభాస్ పోస్ట్‌ చేశాడు. ఫిబ్రవరి 2 షూటింగ్‌ లాంఛనంగా మొదలవుతుంది.

ఓ వైపు గ్రాఫిక్స్ కు సంబంధించి పనులు జరుగుతాయి. మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేస్తారు. టు పాయింట్‌ ఓ సినిమా మాదిరి ఆదిపురుష్‌లో కూడా మోషన్ క్యాప్చర్‌ వర్కే ఎక్కువగా ఉంటుంది. ఈ టీం పెట్టే ఎఫెక్ట్‌ మీదే సినిమా రిజల్ట్‌ ఆధారపడి ఉంటుంది. రోబోలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎఫెక్టీవ్‌గా ఉన్నా.. 2.0లో మోషన్‌ క్యాప్చర్‌ వర్కవుట్‌ కాలేదు. రెండో భాగంలో రజనీకాంత్‌ రోడ్డు మీద పరుగెత్తితే.. హీరో కాస్త పొట్టిగా కనిపించాడు. అలాగే చిట్టి 2.0 విజువల్‌ వర్క్‌ కూడా కాస్త ఆర్టిఫిషియల్‌గా అనిపించింది.

ప్రభాస్‌ నటిస్తున్న రాధే శ్యామ్‌ షూట్‌ దాదాపు పూర్తయింది. ఈ మధ్యనే కెజిఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో సలార్‌ షూట్ లాంఛనంగా మొదలుకాగా.. నెలాఖరు నుంచి రెగ్యులర్‌ షూట్‌లోకి వెళ్తారు. మరోవైపు.. ఆదిపురుష్‌ మోషన్‌ క్యాప్చర్‌ వర్క్ స్టార్ట్‌ అయింది. రాధే శ్యామ్‌ను సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు.  ప్రభాస్‌ దూకుడు చూస్తుంటే.. ఈ ఏడాది రెండు సినిమాలతో పచ్చినా.. రాకున్నా.. గ్యాప్ రాకుండా జగ్రత్తపడుతున్నాడు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: