మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

savitri shivaleela
సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఈ ఏడాది కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని ప్లాన్ వేసినట్టున్నారు ప్రిన్స్. ప్రస్తుతం ఈ హీరో ‘సర్కారు వారి పాట’ సినిమా  షూటింగ్ ను షురూ చేసే పనిలో పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఇన్నిరోజులు వెయిట్ చేసిన మహేష్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ కోసమే మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ బయలుదేరాడు. తమ స్టార్ సినిమా షురూ చెయ్యబోతున్నారంటే ఫ్యాన్స్ ఊరికే ఉంటారా మరి.. అందుకే ప్రిన్స్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నాడన్న వార్త తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ప్రిన్స్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా దీనిని ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు ప్రిన్స్ అభిమానులు. ఇలా ట్రెండ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం ‘సర్కారు వారి  పాట’ పేరుతో 90 మిలియన్స్ కు పైగా హ్యాష్ ట్యాగ్ లను చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. దాంతో సర్కారు వారి పాట 100 మిలియన్ మార్క్ అందుకున్న తొలిచిత్రంగా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్ ను చూసి నెటిజన్లు మహేష్ ఫ్యాన్సా మజాకా అంటున్నారు.
ఎంతైనా అభిమానం అంటే ఇలాగే చూపిస్తారేమో.. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నిర్మించబడుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతేడాది హ్యాట్రిక్ హిట్ తో దుమ్ములేపిన తర్వాత ఈ మహేష్ నటిస్తున్న‘సర్కారు వారి సినిమా’ పట్ల భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: