పూరి షేర్ చేసుకున్న బాపు సీక్రెట్స్ !

Seetha Sailaja
నిన్న సాయంత్రం చెన్నైలో చనిపోయిన తెలుగు తెర మహా దర్శకుడు అచ్చమైన తెలుగు సినిమా చిరునామా బాపు గురించి పూరి జగన్నాథ్ కొన్ని ఆశక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. చాలాకాలం క్రితం బాపూని ఒక హోటల్ లో లంచ్ టేబుల్ దగ్గర పూరి చూసాడట. వెంటనే పూరి ఆయన దగ్గరకు వెళ్లి తాను బాపు అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నాడట. దానికి ప్రతిస్పందనగా ‘‘చాలా థ్యాంక్సండీ’’ అంటూ ముభావంగా ప్రతిస్పందించారట బాపు. అది జరిగిన కొన్ని రోజులకు తన సినిమా ‘అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి’ విడుదల అయిన రోజులలో బాపు తనికెళ్ళ భరిణికి ఉత్తరం రాస్తూ ఈ మధ్యనే ‘అమ్మా - నాన్న - ఓ తమిళమ్మాయి’ చూసాను నువ్వు కూడా చూడు అంటూ ఉత్తరం రాసారట. ఈ విషయం భరిణి ద్వారా తెలుసుకున్న పూరి తన మిత్రుడు ఆ సినిమా హీరో రవితేజాతో కలిసి అడ్రస్ వెతుక్కుని మరీ బాపు ఇంటికి వెళితే ‘‘మీరు పెద్ద డెరైక్టర్ కదా... నా దగ్గర కొచ్చారేంటి?’’ అన్నారట బాపు. దానికి స్పందనగా పూరి ‘‘సార్... రవితేజ హీరోగా మీ డెరైక్షన్‌లో ఓ సినిమా ప్రొడ్యూస్ చెయ్యాలనుకుంటున్నా’’ అని చెప్పగానే ఇలా జోక్ చేస్తున్నావు ఏమిటి? అని అడిగారట బాపు. లోపల నుంచి ఈ మాటలు వింటున్న బాపు మరో ప్రాణం సన్నిహిత మిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణ బయటకు వచ్చి ‘‘మీరు బానే ఉన్నారుగా ఎందుకండీ ఈ పిచ్చిపని. మా టైమ్ అయిపోయింది. మా సినిమాలు ఇప్పుడెవరూ చూడరు’’ అన్నారట రమణ. దీనికి బాపు కూడ వంత పాడుతూ ‘‘మా దగ్గర కథల్లేవు. మీరే కథ ఇవ్వండి’’ అని పూరి వంక తిరిగి జోక్ చేసారట బాపు. తాను సినిమా పరిశ్రమలోకి వచ్చిన తరువాత అంతటి నిజాయితీ ఉన్న వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శ్రద్దాంజలి ఘటించాడు పూరి జగన్నాథ్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: