రాంబాబు ‘ఫ్రీ డౌన్లోడ్’

కొత్త సినిమా వచ్చిందంటే... పైరసీ భూతం కూడా దాన్ని వెంటాడుతుంటుంది. అగ్ర హీరోల మధ్య ఉన్న వైరం కారణంగా... ఒక హీరో మరొక హీరో సినిమాకు పైరసీని వెంటనే మార్కెట్లోకి విడుదల చేస్తుంటారన్నదీ ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈసారి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఇంటర్నెట్లో కొన్ని వెబ్ సైట్లలో ‘ఫ్రీ డైన్లోడ్’ అని కనిపిస్తోందట. యూట్యూబ్, మూవీక్రాకర్ లాంటి వెబ్ సైట్లలో రాంబాబు సినిమా ఫుల్ మూవీ డౌన్లోడ్ ఆప్షన్ తో కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోలు ఎవరో వ్యతిరేకులు పెట్టినవి కావట... రాంబాబు సినిమా వాళ్లే కావాలని పెట్టారంటున్నారు. ఇంతకీ, ఇలా ఎందుకు పెట్టారంటే... తెలంగాణలో మిస్సయిన సీన్లను చూసుకోవాలనుకునేవాళ్లకోసమట. అయితే, ఇదీ ఓ ప్రచారాస్త్రమే అనేవాళ్లూ ఉన్నారు. సినిమాలో కథాబలం... దర్శకుడి పనితనం... లాంటి విషయాలు ఎలా ఉన్నా చిత్రం మాంచి సొమ్ము చేసుకుంది. నెగెటివ్ ప్రచారం బాగానే కలిసొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: