మేము సైతం లో విభేదాలు?

Seetha Sailaja
మరి కొద్ది గంటలలో ప్రారంభం కాబోతున్న ‘మేము సైతం’ కార్యక్రమానికి ఇంకా ప్రారంభం కాకుండానే టాప్ హీరోల మధ్య విభేదాలకు వేదికగా మారుతుందా? అనే వార్తల హడావిడి వినిపిస్తోంది. వినపడుతున్న వార్తల ప్రకారం నిన్న రాత్రి జరిగిన సెలెబ్రెటీ డిన్నర్ కు టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, హాజరు కాలేదు అనే న్యూస్ హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు టాప్ డైరక్టర్లు పూరి, శ్రీనువైట్ల, వినాయక్ లు కుడా ఈ డిన్నర్ కు రాకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచిందని టాక్.  ఈ డిన్నర్ కు రావాలని టాలీవుడ్ నటులందరినీ ఆహ్వానించినా టాప్ హీరోలు ఈ డిన్నర్ కార్యక్రమానికి జర్క్ ఇవ్వడం హాట్ న్యూస్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈషో నిర్వహణలో కొందరి డామినేషన్ తో అలక వహించిన కొంతమంది టాప్ స్టార్స్ అదేవిధంగా కొందరు టాప్ దర్శకులు కాసేపు అటెండెన్స్ కోసం ముఖం చూపించి ఆతరువాత నెమ్మదిగా మాయమై పోవాలని నిశ్చయించు కున్నట్లుగా గాసిప్పులు వినపడుతున్నాయి.  ఈ లిస్టులో ప్రముఖంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పేర్లు వినపడుతున్నాయి. వీరిద్దరూ ఈ కార్యక్రమానికి వచ్చినా వీరిద్దరూ నటించిన స్కిట్స్ లైవ్ లో కాకుండా ఇప్పటికే రికార్డు చేసిన స్కిట్స్ వేదిక పై ప్రదర్శిస్తారు అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం ఈ షో టికెట్లు బాగా అమ్ముడుపోవడానికి మహేష్, పవన్ ల లైవ్ పెర్ఫామెన్స్ ‘మేము సైతం’ లో ఉంటుంది అని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. మరి అసలు విషయం ఏమిటి అన్నది మరి కొద్ది గంటలలో తేలిపోతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: