కనులపండువగా నాని మ్యారేజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాని వివాహం తన ప్రియురాలు అంజనతో జరిగింది. శనివారం రాత్రి 11 గంటలకు వధువు మెళ్లో నాని తాళి కట్టాడు. విశాఖలోని రుషికొండ న్యూనెట్ టెక్నాలజీ ఐటీ సంస్థ ప్రాంగణంలో నగరానికి చెందిన వ్యాపారవేత్త యలపర్తి రతీష్ కుమార్తె అంజనను నాని వివాహం చేసుకున్నాడు. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మంటపంలో నాని పెళ్లి కనులపండువగా జరిగింది. వివాహానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, దర్శకుడు కృష్ణవంశీ, నటులు తరుణ్, దగ్గుబాటి రాణా, భీమిలి కబడ్డీ జట్టు చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు. ప్రత్యేక కల్యాణ మంటపంలో నాని పెళ్లి కనులపండువగా జరిగింది. వివాహ వేదిక వద్దకు మీడియాను అనుమతించలేదు. త్వరలో నాని హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: