టెంపర్ పై లక్ష్మీనరసింహ ప్రభావం !

Seetha Sailaja
జూనియర్ ఎన్టీఆర్‌ ఎన్నో అశలు పెట్టుకుని ఏకంగా పవన్ ‘గోపాల గోపాల’ సినిమాతో పోటీగా దిగబోతున్న 'టెంపర్‌' సినిమా కథ లీక్ అయింది అంటూ ఫిలింనగర్ లో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం పూరీ జగన్నాథ్ తీస్తున్న ఈ సినిమా కథ 1993 ప్రాంతంలో కోలీవుడ్ లో విడుదలైన ‘ఉల్లి వెలై’ సినిమా కథతో పాటు బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీనరసింహ’ సినిమా ఛాయలు ఈ ‘టెంపర్’ లో కనిపిస్తాయని ఫిలింనగర్ టాక్.  ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ఎన్టీఆర్ లంచాలు తీసుకునే పోలీసు ఆఫీసర్ గా కనిపిస్తాడట. అదే క్రమంలో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ప్రకాష్ రాజ్ వద్ద కూడా లంచాలు పుచ్చుకుంటూ అతనికి సహాయ పడుతున్నట్లు నటిస్తూ కొన్ని ట్విస్ట్ ల తరువాత జూనియర్ రియల్ పోలీసు ఆఫీసర్ గా మారి విలన్ ప్రకాష్ రాజ్ నేర సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసాడు అనేది ఈ ‘టెంపర్’ మూల కథ అని అంటున్నారు. విపరీతమైన ఇగో తో ఉండే విలన్ ప్రకాష్ రాజ్ ను అంతకు మించిన ఇగో తో జూనియర్ ప్రకాష్ రాజ్ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ పైకి ప్రేమ నటిస్తూనే వెనుక నుంచి దెబ్బగొట్టే పాత్రలో జూనియర్ ఈ సినిమాలో కనిపిస్తాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కథ విన్న వారికి మాత్రం బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీనరసింహ’ గుర్తుకు వచ్చి తీరుతుంది.  ఈ వార్తలను ఎవరో కావాలని పుట్టించారా? లేక టెంపర్ కథ ఇలాగే నడుస్తుందా? అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి. సంక్రాంతి రేసులో ఉండవలసిన ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి తిరిగి ప్రారంభం కావలసి ఉన్నా జూనియర్ అన్న జానకి రామ్ మరణంతో ఆగిన నేపధ్యంలో ఈ రోజుకి కూడా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: