ఇస్మార్ట్ భామకి లక్ కలిసి రావట్లేదు..!

shami
సుధీర్ బాబు హీరోగా చేసిన నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్. ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్న నభా ఆ తర్వాత పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయడానికి రెండు మూడు సినిమాలు చేసినా అమ్మడికి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది నభా నటేష్.
ఈ రెండు సినిమాలు కూడా ఆమెను నిరాశపరచాయి. అందుకే ఇక మీదట కెరియర్ విషయంలో మరింత ఫోకస్ గా ఉండాలని అనుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియెన్స్ ను మెప్పించిన నభా నటేష్ ఇక మీదట తన ప్రతి సినిమాలో గ్లామర్ షో చేయాలని ఫిక్స్ అయ్యింది. కంటెంట్ తో సంబంధం లేకుండా గ్లామర్ విషయంలో అసలు తగ్గేది లేదని అంటుంది నభా నటేష్. తప్పకుండా నభాకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.
ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నభా నటేష్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సాయి తేజ్ తో.. ఈ సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాలతో వచ్చినా నభాకు అనుకున్నంత క్రేజ్ రాలేడు. ఊవ హీరోలతో పాటుగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించాలని చూస్తుంది అమ్మడు. మరి రానున్న సినిమాలతో అయినా నభా తన టాలెంట్ చూపిస్తుందేమో చూడాలి. చూస్తుంటే సినిమా డిమాండ్ చేయాలే కాని బికిని కూడా వేయడానికి సిద్ధమే అనేట్టుగా నభా నటేష్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: