మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ విడుదల తేదీ ఖరారు..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కెరీర్ పరంగా చాలా స్లో అయ్యాడు. ప్రస్తుతం ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. కానీ విష్ణు ఆ ఫీట్ అందుకోలేకపోయాడు. విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్ల పైనే అవుతోంది. మొన్నటి వరకు వరుస ప్లాప్ లను ఖాతాలో వేసుకొని భరించలేక భారీ గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఈసారి రీఎంట్రీ మాత్రం పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’.  కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయనున్నారట.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటికి రానప్పటికి ఇదే అంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే విష్ణు కెరీర్ లో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ ఎప్పుడో ముగిసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బెస్ట్ అవుట్ ఫుట్ కోసం టైం కేటాయిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: