రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "బాహుబలి" సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని గడగడ లాడించిన ఘనత రాజమౌళిది.ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికి తెలుసు. ఇప్పటికి ఎన్ని బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన కాని బాహుబలి ని టచ్ చేయలేకపోయాయి. ఇప్పుడు బాహుబలి తరువాత జక్కన్న మరో భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న  "ఆర్ ఆర్ ఆర్" సినిమా చేస్తున్నాడు. ఇక ఈ   సినిమా గురించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు మూడవసారి కూడా అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా వచ్చేవరకు అది నిజమని నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది.

అయితే సినిమా రిలీజ్ డేట్ కోసం విడుదలైన హై వోల్టేజ్ పోస్టర్ పై అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ పోస్టర్ ను హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారని  తెలుస్తోంది.ఇదివరకే నేషనల్ జియోగ్రఫీ ఫుటేజ్ ను భీమ్ టీజర్ లో కలిపేసిన జక్కన్న ఇప్పుడు ఘోస్ట్ రైడర్ స్టైల్ లో పోస్టర్ ను దింపేశాడని ట్రోల్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బైక్ పై ఉండగా రామ్ చరణ్ గుర్రపు స్వారితో కనిపిస్తూ అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా చేశారు. అయితే ఘోస్ట్ రైడర్ సినిమాలో కూడా దాదాపు అలాంటి లుక్స్ ఉండడంతో ట్రోలింగ్ డోస్ పెరిగిపోయింది. తస్కరించారు అంటూ మీమ్స్ ఎక్కువగా వస్తున్నాయి.మరి ఈ కాపీలు రాజమౌళి కావాలని చేస్తున్నాడో లేక తెలీక చేస్తున్నాడో అన్న సంగతి ఎవరికీ అర్ధం కావట్లేదు. ఈ విషయంపై "ఆర్ ఆర్ ఆర్"  టీమ్ ఎప్పటిలానే మౌనం పాటిస్తుందో లేదో చూడాలి.

ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రెగ్యులర్ గా ఇవ్వాలని చిత్ర యూనిట్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేయగా త్వరలోనే ఒక పాటని విడుదల చేయబోతున్నారని సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: