నాగ చైతన్య తో పోటీ పడుతున్న ఆ స్టార్... వెనక్కి తగ్గడా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...శేఖర్  కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. లవ్ స్టోరీస్ ని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తారు. ఇక టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరున్న నాగ చైతన్య ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. తన స్టైల్ లో మంచి మంచి సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ చైతన్య.ప్రతి హీరో ఫ్యాన్ కూడా నాగ చైతన్య అంటే ఎంతో ఇష్టపడతారు. ఇక శేఖర్ కమ్ముల నాగ చైతన్య కలయికలో  రూపొందిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

కానీ అప్పటికే నాని ‘టక్ జగదీష్’ సినిమా అదే డేట్ కి వస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు నిర్మాతల సర్కిల్ లో చర్చలు మొదలయ్యాయి. నిజానికి ‘లవ్ స్టోరీ’ సినిమాను చిత్ర నిర్మాత సునీల్ ఏప్రిల్ 9న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ డేట్ కి దిల్ రాజు ‘వకీల్ సాబ్’ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఓ వారం ముందు ఏప్రిల్ 2న రిలీజ్ చేద్దామని ఆలోచించారు.కానీ మార్చి 26న దిల్ రాజు నైజాం ఏరియాకు కొన్న ‘రంగ్ దే’ సినిమా ఉంది. దీంతో ఏప్రిల్ 16నే రిలీజ్ చేసుకోమని దిల్ రాజు స్వయంగా ‘లవ్ స్టోరీ’ నిర్మాత సునీల్ కి చెప్పారట.

 ‘టక్ జగదీష్’ సినిమాను వారం వెనక్కి వెళ్లేలా చూస్తానని కూడా ఆయనే భరోసా ఇచ్చారట. దీంతో సునీల్ ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ వెనక్కి వెళ్లాలంటే నిర్మాత ఒప్పుకుంటే సరిపోదు.. హీరో నాని కూడా అంగీకరించాలి.మరి నాని వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి. లేని పక్షంలో తాను మళ్లీ ఏప్రిల్ 2న లేదా 9న ‘లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేస్తానని సునీల్ అంటున్నారట. అలా జరిగితే దిల్ రాజు ఇబ్బందుల్లో పడతాడు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే  గనుక యాభై శాతం ఆక్యుపెన్సీ కారణంగా నిర్మాతలు కొంతవరకు నష్టపోయే అవకాశాలే పుష్కలంగా  కనిపిస్తున్నాయి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: