నారప్ప మూవీపై సంతృప్తిగా లేని వెంకీ...రీ షూట్ తప్పేలా లేదు...!
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఎదురు చూపులు మరికొంత కాలం తప్పేలా లేవు. కారణం ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయబోతున్నారని వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా అవుట్ పుట్ పై స్వయానా ఈ చిత్ర దర్శకుడే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వెంకటేష్ కూడా సంతృప్తిగా లేనట్లు తెలిసింది. దీని కారణంగానే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తిరిగి రీ షూట్ చేయనున్నారట.
తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అందుకోగా... తెలుగులోనూ వెంకీతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు అందుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట డైరెక్టర్. ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తో నిరాశ చెందిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల... నారప్ప సినిమాతో తిరిగి ఊపు అందుకోవాలంటే... తిరిగి రీ షూట్ చేయక తప్పదని భావిస్తున్నాడట. మరి రీ షూట్ అంటే ఆషామాషీ విషయం కాదు అందరి డేట్స్ కుదరాలి... అన్నిటికంటే పెద్ద విషయం బడ్జెట్. కాబట్టి అందుకు నిర్మాత సురేష్‌బాబు, కలైపులి థాను అంగీకరిస్తారా? అన్న విషయం చర్చనీయాంశమైంది.