రష్మీ, సుధీర్ మధ్య ఇంత స్టోరీ నడుస్తుందా.. అసలు విషయం బయటపెట్టేసిన రోజా..?
అయితే తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని తమ మధ్య ప్రేమ లాంటిది ఏదీ లేదు అని ఇద్దరు పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం బుల్లి తెర ప్రేక్షకులను కట్టిపడేసింది అనే చెప్పాల. వీరిద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నిజంగా రష్మి సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకుంటే మాత్రం అది బుల్లితెర ప్రేక్షకులందరికీ కన్నుల పండుగ అనే చెప్పాలి. ఇక రోజు రోజుకు ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరింత పెరిగిపోతుండడంతో బుల్లితెరపై క్రేజ్ ఎంతగానో పెరిగిపోతూనే ఉంది.
అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ జంటను బుల్లితెర ప్రేక్షకులు చూస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ ఉందా నిజంగానే వారు చెప్పినట్లు స్నేహం ఉందా అన్న దానిపై మాత్రం ఎవరికీ సరైన క్లారిటీ లేదు. అయితే ఇటీవలే జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింద. అయితే ఇక ఈ ప్రోమో ఎప్పటిలాగానే ఆసక్తికరంగా సాగి పోయింది. అయితే ప్రోమో ఎండింగ్ లో రోజా సుడిగాలి సుధీర్ రష్మీ లను అడిగిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. మీరిద్దరూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని రోజా అడగగానే ఇద్దరు మురిసిపోతారు. మీ పెళ్లి చూడాలని ఉంది అంటూ రోజా చెప్పగానే మా పెళ్ళికి ఇంకా టైం ఉంది మేడం అంటూ సుధీర్ చెబుతాడు. ఇక సుధీర్ మాటలను బట్టి చూస్తే వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అన్నది అర్ధం అవుతుంది.