హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి కూతురు ని ఎప్పుడైనా చూసారా..?
బొంబాయ్, రోజా వంటి సినిమాలతో తెలుగు యువతుల మనసులను కొల్లగొట్టిన హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లోనే ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యేవారు. అందుకే అన్ని ప్రముఖ కంపెనీ వారు తమ ప్రకటనలలో యాక్టింగ్ చేయడానికి అరవింద్ స్వామి ని సెలెక్ట్ చేసుకునేవారు. నిజానికి ఆయనకు నటనపై అస్సలు ఆసక్తి ఉండకపోయేది. ఒకానొక సందర్భంలో ఆయన స్టేజ్ మీద సరిగా నటించలేదని.. అర్థంతరంగా స్టేజి మీద నుంచి కిందకు దించేశారు. కానీ అరవిందస్వామి ఏమాత్రం బాధపడకుండా ఎప్పటికైనా తాను ఓ మంచి డాక్టర్ అవ్వాలని అనుకునేవారు.
ప్రస్తుతం ఆయన కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న తలైవి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన తన కూతురు తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. తొలిసారిగా అరవింద్ స్వామి కూతురు సోషల్ మీడియాలో ప్రత్యక్షము కాగా.. ఆయన అభిమానులందరూ ఫిదా అవుతున్నారు. 'సార్, మీ కూతురు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తారా?' అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అరవింద్ స్వామి తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తారో లేదో చూడాలి.