చైతూ లవ్ స్టోరీ తో ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటాడా?
అందుకే, ఇప్పుడు సోలోగా నాగచైతన్య తన మార్కెట్ రేంజ్ ని పెంచుకునేందుకు ఇది పర్ఫెక్ట్ సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన టాలీవుడ్ లవర్ బాయ్ నాగచైతన్యతో హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి కూడా ఆడియన్స్ ని ఫిదా చేయబోతోంది. తాము కన్న కలల్ని నిజం చేసుకునేందుకు హీరో హీరోయిన్స్ ఏం చేశారు అనేది కథాంశంగా ఉండబోతోందని చెప్తున్నారు. అయితే, క్లైమాక్స్ ట్రాజెడీగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. రీసంట్ గా రిలీజైనా టీజర్, సాంగ్స్ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ని అంచనాలని పెంచుతున్నాయి.
చైతూ, సాయిపల్లవి జోడీకి ఆడియన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.అన్ని డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సమ్మర్ లో ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ టైమ్ లో ఫీల్ గుడ్ మూవీలాగా కనిపిస్తున్న లవ్ స్టోరీ నాగచైతన్యకి మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో సినిమా విషయాలు గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...