వివాదంలో ‘అంటే సుందరానికీ’

Chaganti
నాచురల్ స్టార్ నాని 'వి' సినిమా డిజాస్టర్ కావడంతో తర్వాత సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మరీ చేస్తున్నాడు. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అంటే సుందరానికీ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా లాంచ్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన వెంటనే నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాకి సంబంధించి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే వివేక్ తన మొదటి సినిమా మెంటల్ మదిలో రాజ్ కందుకూరి నిర్మాణంలో చేశాడు. 

మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన రెండో సినిమా కూడా తమ బ్యానర్ లోనే చేయాల్సిఉంటుంది రాజ్ కందుకూరి ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ వివేక్ ఆత్రేయ రెండో సినిమా  అంటే శ్రీ విష్ణు, నివేదా థామస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన బ్రోచేవారెవరురా మాత్రం విజయ్ కుమార్ మన్యంకు చెందిన మన్యం ప్రొడక్షన్స్ లో చేశారు. ఆ సమయంలోనే కచ్చితంగా మూడో సినిమా మీ బ్యానర్ లో చేస్తానని రాజ్ కందుకూరితో అగ్రిమెంట్ మళ్ళీ కుదుర్చుకున్నాడు.

 అయితే వివేక్ ఆత్రేయ మూడో సినిమా అంటే ఎప్పుడు నానితో చేస్తున్న సినిమా నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ముందుకు రావడంతో వారితో సినిమా చేస్తున్నాడు. గతంలో ఒకసారి వదిలేస్తే ఇలా రెండో ఆప్షన్ కూడా తీసుకుని హ్యాండ్ ఇచ్చాడని దీంతో సదరు దర్శకుడి మీద చర్యలు తీసుకోవాలని రాజ్ కందుకూరి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. అంతేకాక తన అగ్రిమెంట్ లో ఉన్న వివేక్ తర్వాత మీరు ఎలా సినిమా చేస్తారు అని మైత్రి మూవీ మేకర్స్ ను కూడా ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: