మిస్ హైదరాబాద్ టైటిల్ ను గెలుచుకున్న హీరోయిన్ గురించి తెలుసా ?

kalpana
తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా విడుదలైన "మెయిల్"సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇందులో హీరోయిన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించారు గౌరీ ప్రియా రెడ్డి. "మెయిల్" సినిమా ద్వారా పరిచయమైన ఈమె సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలను చేశారు. గౌరీ ప్రియా గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు తెలిస్తే ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు.                              

శ్రీనివాస్ రెడ్డి, వసుంధర దంపతుల కుమార్తె గౌరీ ప్రియ రెడ్డి. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉంటాయి అన్నది సహజమే. అయితే గౌరీ ప్రియ కూడా ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా మిస్ హైదరాబాద్ టైటిల్ ను గెలుచుకున్నారు. అదేవిధంగా ఈమె ఒక మంచి సింగర్ కూడా. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హోరాహోరి అనే చిత్రంలో ప్లే బ్యాక్ సింగర్ గా పాడారు.గౌరి ప్రియ బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చదవడమే కాకుండా, కర్ణాటక సంగీతంలో అలాగే లలిత సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు.

సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచారు. జెమినీ టీవీ లో వ్యాఖ్యాతగా నిర్వహించారు. అదేవిధంగా బోల్ బేబీ బోల్ రెండవ సీజన్ ,మూడవ సీజన్లలో మొదటి స్థానంలో నిలిచారు.తరువాత మనలో ఒకడు ఫిదా వంటి సినిమాలలో కూడా ఒక కీలక పాత్ర పోషించిన ప్రియా రెడ్డి చాయ్ బిస్కెట్ గర్ల్స్ ఫార్ములాలో కూడా కొన్ని వీడియోలు చేశారు. ప్రస్తుతం "మెయిల్" సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమై తన నటన ద్వారా మంచి ఆదరణ పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: