బెల్లం బాబు సినిమా ఓటిటి విడుదల లేనట్టేనా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ సంక్రాంతికి వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేసిన సంగతి తెలిసిందే... ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటిటి వేదికల పై కూడా సందడి చెయ్యడానికి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా ముందుగా విడుదల అయ్యింది. ఈ సినిమా జనవరి 29న అనగా ఈరోజు అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది. థియేటర్లలో మిస్ అయిన వారంతా ఈ సినిమాని  ఓటిటిలో చూడడానికి తెగ ఎగబడుతున్నారు. ఇక సంక్రాంతి విన్నర్ గా నిలిచిన మాస్ మహారాజా  రవితేజ ‘క్రాక్’ సినిమా  కూడా ఫిబ్రవరి 5న ‘ఆహా’ లో విడుదల అవ్వడానికి సిద్ధంగా వుంది.

నిజం చెప్పాలంటే  జనవరి ఎండింగ్లోనే అంటే ఇప్పటికే  క్రాక్ ఓటీటీ లో విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్ల విన్నపం మేరకు ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మరో హిట్ మూవీ ‘రెడ్’ కూడా అతి త్వరలో ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాత్రం ఓటిటి రిలీజ్ లేదని సమాచారం అందుతుంది.

ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను..సినిమా ప్రారంభమైనప్పుడే జెమినీ వారికి అమ్మేసారట నిర్మాతలు. దీంతో ఇక ఓటిటి రిలీజ్ ఉండదని.. డైరెక్ట్ గా ఛానల్ వారు ప్రీమియర్ ను టెలికాస్ట్ చేసినప్పుడే చూడాలని స్పష్టమవుతుంది. అయితే థియేటర్ లలోనే ఈ సినిమాని చూడనప్పుడు ఓటిటి లో ఎవరు చూస్తారాని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: