మిస్టర్ పర్ ఫెక్ట్ , ఆటోనగర్ సూర్య వంటి సినిమాల నుంచి నన్ను తీసేసారు: రకుల్ ప్రీతి

Divya

2011 వ సంవత్సరంలో దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్, కాజల్,తాప్సీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం " మిస్టర్ పర్ఫెక్ట్". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలుసు. అటు  ప్రభాస్ ఫ్యాన్స్ ను, ఇటు కాజల్, తాప్సి అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని సైతం మెప్పించింది.ఈ సినిమాలో మొదటగా ప్రియ పాత్ర కోసం రకుల్ ప్రీతి ని ఎంచుకున్నారు. రకుల్ ప్రీతి నాలుగు రోజుల పాటు షూటింగ్ లో కూడా నటించింది.  ఇక ఆ తర్వాత ఏం జరిగిందో? దాని వెనుక ఉన్న కారణం ఏంటో? తెలియదు కానీ ఆమె స్థానంలో కాజల్ వచ్చింది. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒక సందర్భంగా రకుల్ ప్రీతి మాట్లాడుతూ.. " మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి నన్ను ఎందుకు తీసేసారో  కారణం నాకు తెలియదు. అనుకోకుండా నన్ను తీసేసి ఆ స్థానంలో కాజల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు.అప్పటికే కన్నడలో ఒక సినిమా చేశాను. అది విడుదలైన తరువాత తెలుగులో నాకు ఆఫర్లు వచ్చాయి. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో మా నాన్న ఆర్మీలో పని చేసేవారు. దాంతో నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఇక  దక్షిణాది చిత్రాల గురించి అయితే అసలుకే తెలీదు. కానీ హీరోయిన్  కావాలి అని బాగా ఆసక్తిగా ఉండేది. అలాంటి సమయంలో తొలిసారి పూరీజగన్నాథ్ గారిని కలిసి సినిమాలపై ఉన్న ఆసక్తిని ఆయనకు చెప్పాను. ఇక "పోకిరి " సినిమా తర్వాత నాకు ఒక సినిమా ఆఫర్ చేశారు. అప్పుడు నాకది పరీక్షల సమయం. అరవై రోజుల పాటు షూటింగ్ అంటే కుదరదు.కేవలం పది రోజులు మాత్రమే ఉండే పాత్రలు ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నాను. అయితే అతిధి పాత్రలు,చిన్న పాత్రలు చేస్తే కెరియర్ ఉండదని అప్పుడు నాకు తెలియదు. కేవలం పాకెట్ మనీ  వస్తే చాలు అనుకున్నాను.

అలాంటి సమయంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ నాకు ఆఫర్ చేశారు. కానీ అది అంత పెద్ద సినిమా అని నాకు తెలియదు. స్క్రీన్ టెస్ట్ చేశారు. ప్రియ పాత్రకు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. అయితే వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉండడంతో సెట్లోనే చదువుకుంటూ ఆ పాత్రలో నటించాను. అయితే డార్లింగ్ హిట్ కావడంతో ఒకే జంటతో మరో సినిమా రిపీట్ చేస్తే బాగుండదని నిర్మాతలు అనుకుని ఉంటారేమో, లేదా  కొత్త అమ్మాయితో రిస్క్ చేయడం ఎందుకని కూడా భావించి ఉండొచ్చు.. అందుకే నన్ను వద్దని చెప్పారు. వాళ్ళ అలా  చెప్పగానే షాక్ అయ్యాను.సవాళ్లు ఎదుర్కోకోకపోతే జీవితంలో పైకి రాలేమని అప్పుడే తెలుసుకున్నాను".

"ఇక అంతేకాకుండా "ఆటోనగర్ సూర్య" లో కూడా ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో సమంత కు  డేట్స్ ఖాళీ లేకపోవడంతో నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు డేట్ అడ్జస్ట్ అవడంతో నన్ను తీసేసి సమంతాను పెట్టుకున్నారు. ఇక రెండు సినిమాలలో నన్ను తీసుకుని రిజక్ట్  చేయడంతో పూర్తిగా చదువు పై దృష్టి పెట్టాను. ఇక డిగ్రీ మూడో సంవత్సరంలో మిస్ ఇండియా పోటీలకు కూడా వెళ్లాను. ఏది ఏమైనప్పటికీ ప్రణాళికబద్ధంగా సినిమాలను ఎంచుకోవాలని  నిర్ణయించుకున్నానంటూ " ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: