శ్రీదేవి మీద కోపంతోనే రాజమౌళి ఇదంతా చేస్తున్నాడా..?
కానీ ఇప్పుడు రాజమౌళి rrr రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే మళ్ళీ శ్రీదేవి గుర్తొచ్చింది కొంతమంది విమర్శకులకు.. రాజమౌళి ఏది అన్నా సరే శ్రీదేవి కి లింక్ పెట్టి విమర్శిస్తున్నారు. ఇప్పుడు బోనీ కపూర్ కి లింక్ పెట్టి మళ్ళీ రాజమౌళి ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న rrr సినిమా ని అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎంటైర్ సినీ పరిశ్రమ అంత సంతోషపడితే.. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ మాత్రం తన బాధను వ్యక్తం చేశాడు. ఈ సంగతి కూడా అందరికీ తెలిసిందే. తన మైదాన్ సినిమాను ఆరు నెలల ముందుగానే విడుదల తేదిని ప్రకటిస్తే.. ఇప్పుడు రాజమౌళి మధ్యలో వచ్చాడంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే దీనిని వేరేలా అర్థం చేసుకున్న విమర్శకులు రాజమౌళి గత జ్ఞాపకాన్ని మనసులో పెట్టుకుని బోనీకపూర్ మైదాన్ సినిమా సమయంలో తన ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేస్తున్నాడని అంటున్నారు. మరి వార్తలపై రాజమౌళి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఏదేమైనా ఇలాంటి సిల్లీ సిల్లీ ఆరోపణలు చేసే టైం ఇటు బోనీ కపూర్ కి గానీ, అటు రాజమౌళి కి గానీ లేదు..