కమెడియన్ సరసన సాయి పల్లవి.. అభిమానులు షాక్..?
అయితే ఈ అమ్మడు అందాల ఆరబోత చేయక పోయినప్పటికీ అటు ప్రేక్షకుల నుంచి మాత్రం విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా తన చిలిపి నవ్వుతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నది సాయి పల్లవి. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ ఎన్నో వైవిధ్యమైన పాత్రల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే. తెలుగులో ఫిదా అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సాయిపల్లవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో సరికొత్త పాత్రలో నటించడంతో పాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
అయితే ఇప్పుడు సాయి పల్లవి మరో సాహసం చేసేందుకు సిద్ధం అయింది అని టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఓ కమెడియన్ సరసన సాయి పల్లవి నటించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కమెడియన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కాళీ వెంకట్ కి జోడిగా సాయిపల్లవి నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం సినిమా నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సాయి పల్లవి ఓకే చెబుతుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరం గా మారిపోయింది. కమెడియన్ సరసన సాయి పల్లవి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులకు షాక్ అవుతున్నారు.