ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ కి వచ్చిన బీటౌన్ బ్యూటీ.. ఎందుకో తెలుసా..??
ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.. ఫిబ్రవరి కల్లా ఎన్టీఆర్ rrr షూట్ కంప్లీట్ చేసి.. మార్చి లో త్రివిక్రమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడని ఇటీవలే ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి..ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకునే ఈ సినిమాలో.. హీరోయిన్ను సెట్ చేసే పనిలో మునిగిపోయాడట మాటల మాంత్రికుడు. యంగ్ టైగర్ 30వ మైల్ స్టోన్ మూవీ అయిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ బీటౌన్ బ్యూటీని తీసుకురాబోతున్నాడట త్రివిక్రమ్.ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కబోతోన్న ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసే ప్రణాళిక చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఈనేపథ్యంలో..
యంగ్ టైగర్ పక్కన బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్ ను రంగంలోకి దింపుతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.తారక్-త్రివిక్రమ్ సినిమాకోసం ఇప్పటికే వరీనా హెస్సేన్ హైదరాబాద్లో ల్యాండయ్యింది. ఈ ముద్దుగమ్మకు టెస్ట్ ఫోటోషూట్ కూడా నిర్వహించారట. అయితే.. ఎన్టీఆర్ సినిమాలో వరీనా ఉంటుందా? లేదా? అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.అలాగే.. త్రివిక్రమ్ చిత్రంలో ఈసారి తారక్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడనే ప్రచారం కూడా ఉంది..మరి దీనిపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది...!!