నేను అన్ని రంగాలలో విజయం సాధించడానికి గల కారణం అతనే : మురళీమోహన్
ఇదిలా ఉండగా మురళీమోహన్ వ్యక్తిగత జీవితానికి వస్తే 1940 వ సంవత్సరంలో స్వతంత్ర సమరయోధులు అయిన మాగంటి మాధవరావు అనే అతనికి జన్మించాడు. ఈయన బాల్యం,చదువు మొత్తం ఏలూరులోనే ముగిసింది. ఆ తరువాత 1963వ సంవత్సరంలో తను సొంతంగా ఎలక్ట్రికల్ మోటార్ తో పాటు ఆయిల్ ఇంజన్స్ బిజినెస్ ని ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత మెల్లిగా ఆయన దృష్టి నాటకాల వైపు వెళ్లడంతో విజయవాడలోని స్టేజ్ పై షోస్ఇవ్వడం ప్రారంభించాడు.మురళీమోహన్ డైరెక్టర్ అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "జగమే మాయ" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన "తిరుపతి" అనే సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రెసిడెంట్ గా పనిచేసి తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించాడు.
మురళీమోహన్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి,ఒక అబ్బాయి. అమ్మాయి పేరు బిందుమాధవి కాగా అబ్బాయి పేరు రామ్ మోహన్. మురళీమోహన్ 2014 వ సంవత్సరంలో లోక్ సభ సీట్ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మురళీమోహన్ కేవలం నటుడు,రాజకీయవేత్త, నిర్మాత మాత్రమే కాకుండా పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. హైదరాబాద్ లోని టాప్ టెన్ వ్యాపారవేత్తలలో మురళీమోహన్ ముందుంటారు. ఇలా వ్యాపార రంగంలో అంత స్థాయిలో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఆయన కొడుకు రామ్ మోహన్. మురళీమోహన్ కు సంబంధించిన వ్యాపారాలన్నీ రామ్ మోహన్ చూసుకుంటున్నాడు.
మురళీమోహన్ తన పేరుమీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఈ ట్రస్టు ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. ఇక ఈ ట్రస్టు ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.