దళపతి విజయ్, అల్లు అర్జున్ కలిసి డ్యాన్స్ చేస్తే..!
తెలుగులో అల్లు అర్జున్ డ్యాన్స్ కు ఇతర భాషల వారు ఫిదా అవుతున్నారు. దానికి ఉదహరణగా అశ్విన్ ఇలా చెప్పడం విశేషం. విజయ్, అల్లు అర్జున్ ఏదైనా సినీ వేడుకలో కలిసి డ్యాన్స్ చేస్తే సూపర్ గా ఉంటుందని అంటున్నాడు అశ్విన్. అసలు వీరిద్దరు కలవడమే కష్టం అంటుంటే కలిసి డ్యాన్స్ చేయడం అని చాలా పెద్ద కోరిక బయట పెట్టాడు అశ్విన్. దళపతి విజయ్ సినిమా అంటే కోలీవుడ్ లో హంగామా మొదలైనట్టే. ఆయన సినిమాకు మాములు టాక్ వచ్చినా సరే 200 కోట్లు ఇలా వచ్చి పడాల్సిందే.
మాస్టర్ సినిమా కూడా అంతే.. సినిమా రిలీజైనప్పుడు పెద్దగా టాక్ లేదు కాని వసూళ్లు మాత్రం 200 కోట్లు గ్రాస్ తెచ్చింది. బాక్సాఫీస్ దగ్గర విజయ్ స్టామినా ఏంటన్నది మాస్టర్ మరోసారి ప్రూవ్ చేసింది. విజయ్ మాస్టర్ హిట్ అవగా తన నెక్స్ట్ మూవీని త్వరలో ప్రకటించాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులన్ని కొల్లగొట్టాడు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ.. మరి ఏదైనా సినిమా అవార్డ్ వేడుకల్లో విజయ్, అల్లు అర్జున్ కలిసి అశ్విన్ కోరికని తీరుస్తారేమో చూడాలి.