వరుణ్ తేజ్ గనిలో మరో స్టార్ హీరో..!

shami
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సయి మంజ్రేకర్ ఛాన్స్ పట్టేసిందట. సినిమా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా వస్తుందని అంటున్నారు. సినిమాలో బాక్సింగ్ తో పాటుగా సెంటిమెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.
గనిలో వరున్ తేజ్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్నారట. వరుణ్ తేజ్ తో ఈక్వల్ గా ఉపేంద్ర రోల్ ఉంటుందని తెలుస్తుంది. కన్నడ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర సుపరిచితుడే. సినిమాలో ఉపేంద్ర, వరుణ్ తేజ్ ల మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఈమధ్యనే మోషన్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసిన వరుణ్ తేజ్ త్వరలోనే టీజర్ తో వస్తారని తెలుస్తుంది.
సినిమాను జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క అంటున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా దుమ్ముదులిపేస్తాడని తెలుస్తుంది. వరుణ్, సయి మంజ్రేకర్ ల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ గనితో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.                               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: