అందుకే రణవీర్ ను పెళ్లి చేసుకున్న.. అసలు కారణం చెప్పిన దీపికా పదుకొనె?
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా చిత్రీకరణలో మొదటి సారి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. ఆ తర్వాత 7ఏళ్లపాటు వీరిద్దరూ డేటింగ్లో మునిగి తేలారు. ఇక ఆ తర్వాత 2018 నవంబర్ 14న వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఒక్కటయ్యారు. ఇక వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ సినీ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ లుగానే కొనసాగుతున్నారు. ఓవైపు వరుస సినిమాలు చేసుకుంటూ రణవీర్ దూసుకుపోతుంటే దీపికా పదుకునే కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.
అయితే రణవీర్ కపూర్ ను వివాహం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే చెప్పుకొచ్చాడు. సంపాదన పరంగా రణబీర్ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండే వాడని ఒకే విధంగా గౌరవించే వాడని.. అందుకే అతనితో ఉన్న బంధం పెళ్లి వరకు వెళ్ళింది అంటూ చెప్పుకొచ్చింది. మొదటి నుంచి కూడా తన విజయాన్ని సంపాదనను రణవీర్ ఎంతో గౌరవించే వాడు అని.. ఇప్పుడు తాను కూడా ఒక మంచి స్టార్ గా మారిపోయాడు అంటూ దీపిక తెలిపింది. కానీ 7ఏళ్ల క్రితం రణవీర్ దగ్గర ఇవేవీ లేవని ఆ సమయంలో తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉండటంతో వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అతను తన విజయాన్ని ఎంతో గౌరవించే వాడు అంటూ చెప్పుకొచ్చింది. అందుకే మేమిద్దరం ఏడడుగుల బంధం లో అడుగుపెట్ట గలిగాము అంటూ దీపికా పదుకొనే చెప్పుకొచ్చారు.