బిగ్ బాస్ 5.. ఈసారి పెద్ద పెద్ద వాళ్లనే మాట్లాడుతున్నారట..!
బిగ్ బాస్ సీజన్ 5 లో ముఖ్యంగా జబర్దస్త్ నుండి క్రేజీ కమెడియన్స్ ను సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. అందులో ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి సుడిగాలి సుధీర్, రెండొవది హైపర్ ఆది. ఆల్రెడీ జబర్దస్త్ నుండి సీజన్ 4లో అవినాష్ వచ్చి షాక్ ఇచ్చాడు. అయితే జబర్దస్త్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని బిగ్ బాస్ కు వెళ్లేందుకు దాదాపు 10 లక్షల దాకా అవినాష్ చెల్లించాడని వార్తలు వచ్చాయి. అలా చూస్తే సుధీర్, ఆదిలు కూడా అలానే పెనాలిటీ కట్టి బిగ్ బాస్ కు రావాల్సి ఉంటుంది.
అయితే ఆది, సుధీర్ లు మాములు కమెడియన్స్ కాదు. జబర్దస్త్ కు ఒక క్రేజ్ తెచ్చిన కమెడియన్స్ కాబట్టి వారిని సాధ్యమైనంత వరకు షో నుండి వెళ్లకుండా జాగ్రత్తపడతారని తెలుస్తుంది. అయినా సరే వారు వెళ్తామని అంటే వారు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఆపే ప్లాన్ లో ఉన్నారట. అవినాష్ బయటకు వెళ్లాక జబర్దస్త్ టీం లో కొందరికి మంచి హోప్ వచ్చింది. అందుకే ఈటివిని వదిలి స్టార్ మాని నమ్ముకుంటే బెటర్ అని ఫిక్స్ అయ్యారు.