ప్రస్తుతం గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు..
తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేము. నటించింది ఒకటి, రెండు సినిమాలలోనైనా చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు. వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. ఇక గంగోత్రి సినిమా హీరోయిన్ ఎవరో కాదు ఆర్తి అగర్వాల్ కు స్వయానా చెల్లెలు. ఆర్తి అగర్వాల్ చిన్నప్పటినుండి న్యూజెర్సీలో పుట్టి,పెరిగి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సలహా మేరకు హిందీలో పాగాలప్పన్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా "నువ్వు నాకు నచ్చావ్" సినిమా ద్వారా తెలుగు సినీ అరంగేట్రం చేసింది. ఈ చిత్రం అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇక తరువాత ఈమె తెలుగులో చేసిన ఇంద్ర, నీ స్నేహం, వసంతం, నేనున్నాను,సంక్రాంతి, గోరింటాకు తో పాటు అందాల రాముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇక అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో తన చెల్లెలైన అతిథి అగర్వాల్ ను న్యూ జెర్సీ నుండి ఇండియాకు రప్పించి,అల్లు ఫ్యామిలీ కి పరిచయం చేసింది. ఇక అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రిలో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది అతిథి అగర్వాల్. ఇక తొలి సినిమాతోనే అతిథి అగర్వాల్ కూడా సంచలన విజయం అందుకుంది. ఇక వరుసగా ఆమెకు టాలీవుడ్ నుంచి హీరోయిన్ అవకాశాలు రావడం మొదలు అవడంతో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టింది. కానీ ఆ సమయంలో అతిథి అగర్వాల్ వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడంతో, ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.
ఇక అంతేకాకుండా శ్రీఆంజనేయం సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన తర్వాత కొన్ని రోజులు ఆమెతో షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఒక సమయంలో ఫుల్ రొమాంటిక్ గా చేయాలని కృష్ణవంశీ చెప్పడంతో ఆమె అందుకు నో చెప్పిందట. ఇక చెయ్యకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి నువ్వు తప్పుకోవాలి అని కృష్ణవంశీ చెప్పడంతో, ఆమె ఆ సినిమా నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా చార్మీ తో తీశాడు కృష్ణవంశీ.
ఇలా చేతులారా అప్పట్లో ఎన్నో సినిమాలను వదులుకోవడంతో, అతిథి అగర్వాల్ చిన్న హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. అయితే అకస్మాత్తుగా ఎవరూ ఊహించని విధంగా తన అక్క ఆర్తి అగర్వాల్ మరణించడంతో, అతిథి అగర్వాల్ పై తీవ్రస్థాయిలో మానసికంగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక ఆర్తి అగర్వాల్ తన కెరియర్ బాగా పీక్స్ లో ఉన్నప్పుడు తరుణ్ తో లవ్ లో పడడం, ఆ పెళ్లికి తరుణ్ తల్లి రోజారమణి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, ఆత్మహత్యయత్నం చేసుకుంది.
ఇక ఆ తరువాత అగ్రహీరోయిన్ గా కొనసాగిన ఆర్తికి, అకస్మాత్తుగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. సినిమాలు లేకపోవడంతో భారీగా లావు పెరగడం తో ఇక లావు తగ్గడం కోసం అమెరికాలో చేయించుకున్న ఆపరేషన్ వికటించి,ప్రాణాలు కోల్పోయింది. ఆర్తి చనిపోవడంతో అతిథి అగర్వాల్ కూడా సినిమాలతో పాటు పెళ్లి కూడా దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతూ జీవనం సాగిస్తోంది .