23 వ రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టిన క్రాక్...
సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. డబుల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలవడం విశేషం. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.దీంతో ఇండస్ట్రీ లో వీరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని వీరిద్దరూ రుజువు చేశారు.
ఇక ఈ మాస్ బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 23 రోజులకు గాను ఈ చిత్రం 36.50 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లు 18.50 కోట్ల లాభాలను దక్కించుకున్నారు.అంటే రెండింతల లాభం సాధించారనమాట...